Ntr: బాలీవుడ్‌లో వార్‌కు సిద్దమైన ఎన్టీఆర్‌

NTR ready for war in Bollywood

  • వార్‌-2 షూటింగ్‌ కోసం ముంబై బయలుదేరిన ఎన్టీఆర్‌ 
  • ఎన్టీఆర్‌ నటిస్తున్న తొలి బాలీవుడ్‌ చిత్రమిది 
  • వచ్చే ఏడాది ప్రారంభంలో వార్‌-2 రిలీజ్‌కు సన్నాహాలు

దేవర సాధించిన విజయంతో ఖుషీలో వున్నాడు ఎన్టీఆర్‌. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన దేవరకు తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల విషయంలో దేవర ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ప్రారంభ వసూళ్లతో పాటు రెండో వారం, మూడో వారం వసూళ్లు కూడా స్టడిగా వుండటంతో దేవర కమర్షియల్‌ కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రానికి ముఖ్యంగా దసరా సెలవులు మంచి అడ్వాంటేజీగా మారటంతో దేవర కలెక్షన్ల లక్ష్యాన్ని చేరుకుంది. 

ఇప్పుడు ఈ విజయం ఉత్సాహాంలో వున్న ఎన్టీఆర్‌ తన బాలీవుడ్‌లో నటిస్తున్న తొలిచిత్రం వార్‌-2 చిత్రం షూటింగ్‌లో పాల్గొనడానికి శనివారం ముంబైకి బయలుదేరాడు. ఇంతకు ముందు ఎన్టీఆర్‌ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నాడు. అయితే చాలా కాలం విరామం తరువాత ఇటీవల వార్‌-2 షూటింగ్‌ మళ్లీ మొదలైంది. తాజాగా ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కూడా చిత్రీకరించడానికి యూనిట్‌ రెడీగా వుండటంతో ఎన్టీఆర్‌ ముంబై వెళ్లారు. 

బాలీవుడ్‌లో రూపొంది ఘనవిజయం సాధించిన వార్‌ చిత్రానికి సీక్వెల్‌ వార్‌-2 తెరకెక్కుతోంది. మొదటిభాగంలో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించారు. ఇప్పుడు సీక్వెల్‌లో టైగర్ ష్రాఫ్‌ స్థానంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ తొలి కలయికలో ఈ చిత్రం రూపొందుతోంది. బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రెడీ అవుతున్న వార్‌-2 చిత్రాన్ని 2025 ప్రారంభంలో  విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

Ntr
War 2
War 2 latest news
Ntr latest movie
Ntr war 2
Tollywood
Cinema
Hrithik Roshan
  • Loading...

More Telugu News