G Jagadish Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడకపోవడమే మంచిది: జగదీశ్ రెడ్డి
- కోమటిరెడ్డి మాట్లాడిన మాటల్లో ఎలాంటి సబ్జెక్ట్ లేదన్న జగదీశ్ రెడ్డి
- బీఆర్ఎస్ నేతలమేమీ వ్యక్తిగతంగా మాట్లాడలేదన్న మాజీ మంత్రి
- కోమటిరెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడకపోవడమే మంచిదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మాట్లాడిన మాటల్లో ఎలాంటి సబ్జెక్ట్ కనిపించలేదని చురక అంటించారు.
హరీశ్ రావు కావొచ్చు... కేటీఆర్ కావొచ్చు... నేను కావొచ్చు... మేం మాట్లాడిన మాటల్లో సబ్జెక్ట్ కాకుండా వేరే ఏదీ ఉండదన్నారు. తాము ఏ బూతుపదాన్ని ఉపయోగించలేదని, ఇంకేమీ వ్యక్తిగతంగా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. కానీ మంత్రి మాట్లాడిన మాటల్లో ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకు మంత్రి కోమటిరెడ్డి చిల్లర చేష్టలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాము అందులోకి పోదల్చుకోలేదని మాజీ మంత్రి పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం తెలిసిందే.