CM Ramesh: ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమే: సీఎం రమేశ్

CM Ramesh comments on ED raids on MVV Satyanarayana

  • వైసీపీ నేతలపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశానన్న సీఎం రమేశ్
  • జగన్ సహా అందరి భాగోతాలు బయటపడతాయని వ్యాఖ్య
  • వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును కక్కిస్తామన్న రమేశ్

వైసీపీ నేత, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసం, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ... ఎంవీవీ ఇంటిపై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇంకా కొనసాగుతాయని చెప్పారు. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మంతా కక్కించి, ప్రజల సంక్షేమం కోసం వినియోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

వైసీపీ నేతల అక్రమార్జనసై సీబీఐ, ఈడీలకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. త్వరలోనే జగన్ తో పాటు ఇతర వైసీపీ అక్రమార్కుల అవినీతి భాగోతాలన్నీ బయటపడతాయని అన్నారు. మరోవైపు, ఎంవీవీ సత్యనారాయణ ఆడిటర్ వెంకటేశ్వరరావు (జీవీ) నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

CM Ramesh
BJP
MVV Satyanarayana
Jagan
YSRCP
  • Loading...

More Telugu News