Kakani Govardhan Reddy: చంద్రబాబు ఒకటి చెపుతారు... క్షేత్ర స్థాయిలో మరొకటి జరుగుతుంది: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Kakani Govardhan fires on Chandrababu

  • మద్యం, ఇసుకలో భారీ దోపిడీ జరుగుతోందన్న కాకాణి
  • టీడీపీ నేతలు వాటిని ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని విమర్శ
  • వైన్ షాపులను సొంతం చేసుకున్న వారిని కిడ్నాప్ చేశారని ఆరోపణ

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి విమర్శలు గుప్పించారు. మద్యం, ఇసుకలో కూటమి నేతలు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే దానికి, చేసే దానికి పొంతన ఉండదని చెప్పారు. 

పార్టీ నేతలకు ఆయన ఒకటి చెపుతారని, కానీ క్షేత్ర స్థాయిలో మరొకటి జరుగుతుందని అన్నారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లద్దొని పార్టీ సమావేశాల్లో చంద్రబాబు చెపుతారని, కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని తెలిపారు. 

మద్యం షాపుల లాటరీల్లో వైన్ షాపులు సొంతం చేసుకున్న వారిని కిడ్నాప్ చేశారని కాకాణి విమర్శించారు. తమ అనుమతులు లేకుండా టెండర్లు ఎలా వేశారని భయపెడుతున్నారని దుయ్యబట్టారు. 

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్న మీడియాపై కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు.

Kakani Govardhan Reddy
YSRCP
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News