Visakha Sarada Peetham: విశాఖ శారదాపీఠంకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

AP Govt cancelled land permission to Visakha Sarada Peetham
  • విశాఖలో శారదాపీఠంకు 15 ఎకరాల స్థలం ఇచ్చిన గత ప్రభుత్వం
  • ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టిన కూటమి ప్రభుత్వం
  • స్థలం అనుమతులు రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు
విశాఖ శారదాపీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ. 220 కోట్లు అయితే... కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది. కూటమి ప్రభుత్వ వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది.

దాంతోపాటే, తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. 

Visakha Sarada Peetham
Land

More Telugu News