Amaravati Works: అమరావతి పనులను ప్రారంభించిన చంద్రబాబు

Chandrababu started Amaravati works

  • సీఆర్డీఏ కార్యాలయం వద్ద పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు
  • 8 అంతస్తులతో భవన నిర్మాణం
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. సీఆర్డీఏ పనుల ద్వారా రాజధాని పనులను ఆయన ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో రూ. 160 కోట్లతో ఎనిమిది అంతస్తుల సీఆర్డీఏ కార్యాలయ పనులను ప్రారంభించారు. ఆ పనులు మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు సీఆర్డీఏ కార్యాలయం నుంచే పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెం వద్ద పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ చంద్రబాబు పూజలు నిర్వహించారు. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. అదనంగా ల్యాండ్ స్కేపింగ్, పార్కింగ్ కు 2.51 ఎకరాలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ లో ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్ లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News