Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీంను దుబాయ్ లో శరద్ పవార్ కలిశారు: ప్రకాశ్ అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు

Sharad pawar met Dawood Ibrahim in Dubai says Prakash Ambedkar

  • మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు దావూద్ ను పవార్ కలిశారన్న అంబేద్కర్
  • పవార్ కు దావూద్ గోల్డ్ చెయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని వ్యాఖ్య
  • బీజేపీకి మేలు చేయడానికి ఆయనిలా మాట్లాడుతున్నారని ఎన్సీపీ (ఎస్పీ) మండిపాటు

వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ దుబాయ్ లో కలిశారని ఆయన అన్నారు. ఆ సందర్భంగా పవార్ కు దావూద్ గోల్ద్ చెయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని తెలిపారు. 

1988 - 1991 మధ్య కాలంలో శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని అంబేద్కర్ తెలిపారు. అప్పట్లో ఆయన అధికారికంగా విదేశీ పర్యటనకు వెళ్లారని చెప్పారు. తొలుత లండన్ కు వెళ్లారని, అక్కడి నుంచి కాలిఫోర్నియాకు వెళ్లారని, అనంతరం కాలిఫోర్నియా నుంచి లండన్ కు తిరిగొచ్చారని... లండన్ లో రెండు రోజుల పాటు బస చేసిన తర్వాత దుబాయ్ కు వెళ్లారని వెల్లడించారు. 

దుబాయ్ ఎయిర్ పోర్టులో శరద్ పవార్ ను దావూద్ కలిశారని ప్రకాశ్ అంబేద్కర్ తెలిపారు. పవార్ కు స్వాగతం పలికి, గోల్డ్ చెయిన్ ను దావూద్ బహూకరించారని చెప్పారు. అదే రోజు సాయంత్రం పవార్ లండన్ కు తిరుగుపయనమయ్యారని... రెండు రోజుల తర్వాత ఇండియాకు వచ్చారని తెలిపారు. 

విదేశీ ట్రిప్ కు కేంద్ర అనుమతిని పవార్ తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అది అధికారిక పర్యటనా? లేక అనధికారిక పర్యటనా? అని అడిగారు. ఒకవేళ పవార్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చి ఉంటే... దావూద్ ను కలవడానికి కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. 

మరోవైపు, ప్రకాశ్ అంబేద్కర్ ఆరోపణలపై ఎన్సీపీ (ఎస్పీ) మండిపడింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు... బీజేపీకి మేలు చేయడానికి ప్రకాశ్ అంబేద్కర్ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడే ప్రకాశ్ అంమేద్కర్ అన్న విషయం చాలామందికి తెలిసిందే! 

  • Loading...

More Telugu News