Nara Lokesh: విశాఖలో కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh attends cross examination in Visakha court
  • గతంలో నారా లోకేశ్ పై సాక్షిలో కథనం
  • 'చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి' పేరిట కథనం
  • ఇది అవాస్తవ కథనం అంటూ పరువునష్టం దావా వేసిన లోకేశ్
  • నేడు విశాఖ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరు
ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖపట్నం వచ్చారు. సాక్షి మీడియాపై పరువునష్టం దావా కేసులో నారా లోకేశ్ విశాఖలో కోర్టుకు హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన సమయంలో ఆయన వెంట విశాఖ ఎంపీ భరత్, ఇతర టీడీపీ నేతలు, న్యాయవాదులు ఉన్నారు. 

దీనిపై లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. 'చినబాబు చిరుతిండి రూ.25 లక్షలండి' అంటూ సాక్షిలో తనపై 2019 అక్టోబరు 22న అసత్య కథనాన్ని ప్రచురించారని లోకేశ్ వెల్లడించారు. తప్పుడు కథనాలు ప్రచురించిన సాక్షిపై విశాఖ కోర్టులో తాను రూ.75 కోట్లకు పరువునష్టం కేసు వేశానని తెలిపారు. ఈ కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఈరోజు కోర్టుకు వచ్చానని నారా లోకేశ్ వివరించారు.
Nara Lokesh
Cross Examination
Court
Visakhapatnam
Sakshi
Defamation Suit
TDP
YSRCP

More Telugu News