KTR: రేవంత్ రెడ్డి మీడియా సమావేశం... స్పందించిన కేటీఆర్

KTR responds on Revanth Reddy press meet

  • మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్
  • రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రజెంటేషన్ ఉంటుందని వెల్లడి
  • మూసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తామన్న కేటీఆర్

మూసీ రివర్ ఫ్రంట్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేపు అన్ని వివరాలు చెబుతానన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ టెండర్ రూ.141 కోట్లు అయితే లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టు అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ మీడియా సమావేశంపై కేటీఆర్ స్పందించారు. మూసీకి సంబంధించి రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని వెల్లడించారు. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. మూసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రణాళికలను వివరిస్తామన్నారు.

KTR
Revanth Reddy
Telangana
Musi River
  • Loading...

More Telugu News