India vs New Zealand: బెంగ‌ళూరు టెస్టు... కివీస్ బౌల‌ర్ల విజృంభ‌ణ‌... 46 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్‌

Team India All Out for 46 Runs in Bengaluru Test

  • బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌, న్యూజిలాండ్ తొలి టెస్టు
  • భార‌త బ్యాట‌ర్లలో ఐదుగురు డ‌కౌట్
  • 5 వికెట్లతో భార‌త ఇన్నింగ్స్‌ను శాసించిన‌ మాట్ హెన్రీ

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కుప్ప‌కూలింది. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియాను కివీస్ బౌల‌ర్లు వ‌ణికించారు. ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు విజృంభించ‌డంతో భార‌త జ‌ట్టు భోజ‌న విరామానికి 34 ప‌రుగుల‌కే 6 వికెట్లు పారేసుకుంది. ఆ త‌ర్వాత కూడా భార‌త్ ఇన్నింగ్స్ గాడిలో ప‌డ‌లేదు. దాంతో 46 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. 

భార‌త బ్యాట‌ర్లలో ఐదుగురు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, కేఎల్ రాహుల్‌, ర‌వీంద్ర జ‌డేజా, అశ్విన్ ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరారు. మ‌ధ్య‌లో య‌శ‌స్వి జైస్వాల్ (13), రిష‌భ్ పంత్ (20) ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. 

పంత్ ఔట్ కావ‌డంతో రోహిత్ సేన 39 ప‌రుగుల‌ వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత 31.2 ఓవ‌ర్ల‌లో 46 ర‌న్స్‌కే చెతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మాట్ హెన్రీ 5 వికెట్లు తీయ‌గా... విలియం ఓ రూర్కే నాలుగు వికెట్ల‌తో భార‌త ఇన్నింగ్స్‌ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు.

  • Loading...

More Telugu News