Jagan: వైసీపీ నేత కుమార్తె పెళ్లికి హాజరైన జగన్

Jagan attends YCP leader daughter marriage

  • పోరంకి మురళీ రిసార్ట్స్ లో వివాహ వేడుక
  • జగయ్యపేట వైసీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహం
  • వరుడు యశ్వంత్ రాజా మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తనయుడు
  • వధూవరులకు ఆశీస్సులు అందజేసిన జగన్ 

వైసీపీ అధినేత జగన్ నేడు ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. జగ్గయ్యపేట వైసీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సారూప్య, యశ్వంత్ రాజాకు తన ఆశీస్సులు అందజేశారు. వరుడు యశ్వంత్ రాజా మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కుమారుడు. 

ఈ వివాహం విజయవాడలోని పోరంకి మురళీ రిసార్ట్స్ లో జరిగింది. జగన్ రాక సందర్భంగా పెళ్లి వేడుకలో భారీ కోలాహలం నెలకొంది. జగన్ ను కలిసేందుకు జనాలు పోటీలు పడ్డారు. అందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు.

Jagan
Wedding
Vijayawada
YSRCP
  • Loading...

More Telugu News