Telangana: తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌ల స్థానంలో ఇంఛార్జ్‌ల నియామకం

Incharge IAS in Telangana

  • డీవోపీటీ ఆదేశాలతో రిలీవ్ అయిన ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, కరుణ, వాణీప్రసాద్
  • ఆమ్రపాలి స్థానంలో జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి నియామకం
  • పలువురు ఇంఛార్జ్‌లను నియమిస్తూ సీఎస్ జీవో జారీ

తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జులను నియమించింది. ఇటీవల డీవోపీటీ తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్న ఐఏఎస్‌లను ఏపీకి, ఏపీలో కొనసాగుతున్న అధికారులను తెలంగాణకు వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి రిలీవ్ అయ్యారు. వారి స్థానంలో ఇంఛార్జులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్‌ సుల్తానియా, మహిళా సంక్షేమశాఖ కార్యదర్శిగా టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్వీ కర్ణన్‌, ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Telangana
IAS
Amrapali
CS Shanti Kumari
  • Loading...

More Telugu News