Mallu Bhatti Vikramarka: అప్పులు, ఖర్చుల లెక్కలపై కేటీఆర్‌కు భట్టివిక్రమార్క సమాధానం ఇదీ...!

Bhattivikramarka released debts of TG government

  • రూ.80 వేల కోట్లకు పైగా అప్పులు చేసి ఈ ప్రభుత్వం ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్న
  • అప్పులు, ఖర్చుల లెక్కలపై ప్రకటన విడుదల చేసిన డిప్యూటీ సీఎం కార్యాలయం
  • డిసెంబర్ నుంచి రూ.56 వేల కోట్ల పాత అప్పులు, వడ్డీలు చెల్లించామని వెల్లడి

తమ ప్రభుత్వం వచ్చిన ఈ పది నెలల కాలంలో రూ.56 వేల కోట్లకు పైగా పాత అప్పులు, వడ్డీలను చెల్లించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. ఇదే కాలంలో రూ.49 వేల కోట్ల రుణాలు తీసుకున్నామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, వ్యయంపై ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ 15 వరకు అప్పులు, ఆదాయం, ఖర్చుల వివరాలను అందులో పేర్కొంది. 

అక్టోబర్ 15 వరకు ప్రభుత్వం తీసుకున్న రుణాల మొత్తం రూ.49,618 కోట్లుగా ఉందని తెలిపింది. పాత అప్పులు, వడ్డీల కోసం రూ.56,440 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. వివిధ పథకాల కోసం రూ.54,346 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.

రూ.80 వేల కోట్లకు పైగా అప్పులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిందా? ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ప్రశ్నించారు. దీనికి భట్టివిక్రమార్క తన కార్యాలయం ద్వారా పైవిధంగా సమాధానం ఇచ్చారు.

  • Loading...

More Telugu News