Allu Arjun: అల్లు అర్జున్‌ కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం

1600 km cycle ride for Allu Arjun

  • అల్లు అర్జున్‌పై ప్రేమను చాటిని ఉత్తరప్రదేశ్‌ అభిమాని 
  • సైకిల్‌పై హైదరాబాద్‌ చేరుకున్న బన్నీ ఫ్యాన్ 
  • వైరల్‌గా మారిన వీడియో 

సినిమా స్టార్స్‌కు అభిమానులు ఉండటం కామనే. అయితే కొంత మంది అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్త పరచడం కోసం తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూ సదరు తారలపై తమ అభిమానాన్ని చాటుకుంటారు. 

తాజాగా పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్న హీరో అల్లు అర్జున్‌పై ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. పుష్ప చిత్రంతో తగ్గేదెలే అంటూ స్పెషల్ మేనరిజం స్వాగ్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న అల్లు అర్జున్‌పై ఓ అభిమాని  తన ప్రేమను వ్యక్తపరిచాడు. 

అల్లు అర్జున్‌ను అమితంగా ఇష్టపడే ఓ అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ నుండి ఐకాన్‌స్టార్‌ను కలవడానికి సైకిల్‌పై 1,600 కిలోమీటర్లు ప్రయాణించి అల్లు అర్జున్‌ను చేరుకున్నాడు. తన అభిమాన హీరోని కలిసిన అతను కాసేపు ఆయనతో చిట్‌ చాట్‌ చేశాడు. 

వైరల్‌గా మారిన ఈ వీడియోలో అల్లు అర్జున్‌ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం చూడొచ్చు. తమ అభిమాన హీరోని కలిసిన ఆ అభిమాని ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అల్లు అర్జున్‌ ను తన నిజమైన హీరోగా పేర్కొనడమే కాదు, అల్లు అర్జున్‌ను కలవడం తన జీవితంలో మరుపురాని అనుభూతిగా ఆ అభిమాని వర్ణించాడు. 

అంతేకాదు, సైక్లింగ్ మొదలుపెట్టే ముందు చాలాసార్లు హనుమాన్‌ చాలిసా చదివానని ఈ సందర్భంగా ఆ అభిమాని తెలిపాడు. ఇక అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప-2 ది రూల్‌ డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Allu Arjun
Pushpa
Pushap2 latest news
1600 km cycle ride for Allu Arjun
Cinema

More Telugu News