Sensex: నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్
- 318 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- బీఎస్ఈలో లాభాల్లో ముగిసిన 2,030 షేర్లు
భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకుల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు క్షీణించి 81,501 వద్ద ముగియగా... నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 24,971 వద్ద స్థిరపడ్డాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 141 పాయింట్లు క్షీణించి 59,451 వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 2.85 పాయింట్లు లాభపడి 19,305 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ 105 పాయింట్లు నష్టపోయి 51,801 వద్ద ముగిసింది.
ఫిన్ సర్వీస్, రియల్టీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభపడగా, ఆటో, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈలో 2,030 షేర్లు లాభపడగా... 1,930 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 108 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
సెన్సెక్స్-30 స్టాక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఎస్బీఐ టాప్ గెయినర్‌లుగా ఉండగా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, జేఎస్‍డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్, టైటాన్, కొటక్ మహీంద్రా, ఐటీసీ టాప్ లూజర్లుగా నిలిచాయి.