BoyapatiSreenu: నారా బ్రాహ్మణి క్లాప్‌తో బాలకృష్ణ 'అఖండ-2: తాండవం' ప్రారంభం

Balakrishna Akhanda2 Tandavam begins with Nara Brahmani Clap

  • బాలకృష్ణ-బోయపాటి కలయికలో నాలుగో చిత్రం అఖండ-2
  • వైరల్‌గా మారిన అఖండ-2 ప్రారంభోత్సవ ఫోటోలు 
  • అఖండ-2కు తమన్‌ స్వరాలు



నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా ఈ ఎవర్‌గ్రీన్‌ కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రం 'అఖండ-2: తాండవం' చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

అఖండ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌తో పాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా పాల్గొన్నారు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి నారా బ్రాహ్మణి క్లాప్‌ కొట్టారు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

  • Loading...

More Telugu News