KTR: రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం: కేటీఆర్

KTR says will protect poor people houses from bulldozers

  • 1980లోనే కాంగ్రెస్ ప్రభుత్వం 20 వేల మందికి పట్టాలు ఇచ్చిందన్న కేటీఆర్
  • పార్టీ లీగల్ సెల్ ద్వారా మూసీ పరీవాహక బాధితులకు అండగా ఉంటామని హామీ
  • బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరించేందుకే హైడ్రాను తీసుకువచ్చారన్న కేటీఆర్

హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు తాము అడ్డంగా నిలబడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూకట్‌పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వమే 20 వేల మందికి పట్టాలు ఇచ్చిందని వెల్లడించారు. ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో పర్యటించి మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులను పరిశీలిస్తామన్నారు.

హైడ్రా వసూళ్లతోనే నాంపల్లిలో కాంగ్రెస్, మజ్లిస్ నేతల మధ్య గొడవ జరిగిందన్నారు. తాము బస్తీల్లోకి వెళ్లి పార్టీ లీగల్ సెల్ ద్వారా బాధితులకు అండగా ఉంటామన్నారు. మూసీ విషయంలో ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. మూసీ పరీవాహక పరిధిలోని పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేసేందుకే హైడ్రాను తీసుకువచ్చారని ఆరోపించారు.

మూసీ పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. మూసీ న‌ది ప‌రీవాహ‌క ప్ర‌జ‌ల‌కు యాభై ఏళ్ల క్రితం ప్ర‌భుత్వ‌మే పట్టాలను ఇచ్చి, రిజిస్ట్రేష‌న్లు చేసిందన్నారు. ఇన్నాళ్లూ వారి చేత న‌ల్లా బిల్లు, క‌రెంట్ బిల్లు క‌ట్టించుకుందని తెలిపారు. ఇప్పుడు వచ్చి కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూలుస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో రాడార్ స్టేషన్ ఏర్పాటుతో ఒక్క ఉద్యోగమూ రాదన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించే ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడమేమిటని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News