Dushara Vijayan: దుషారా విజయన్ కి పెరుగుతున్న క్రేజ్!

Dushara Vijayan Interview

  • 2019లో ఎంట్రీ ఇచ్చిన దుషారా 
  • కెరియర్ పరంగా కలిసొచ్చిన 2024
  • ఇమేజ్ పెంచేసిన రాయన్ - వేట్టయన్ 
  • చేతిలో విక్రమ్ సినిమా 'వీర ధీర శూరన్'


తమిళ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'దుషారా విజయన్'. 'రాయన్' .. 'వేట్టయన్' సినిమాల రిలీజ్ తరువాత నుంచి ఆమె పేరు అందరి నోళ్లలో నానుతోంది. తమిళనాడులోని 'దుండిగల్' ప్రాంతానికి చెందిన దుషారా, 2019లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత  నుంచి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంటూ, తన ఇమేజ్ ను పెంచుకుంటూ వెళుతోంది.సాధారణ కుటుంబానికి చెందిన యువతి పాత్రలలో దుషారా ఇట్టే ఒదిగిపోతోంది. ఈ తరహా పాత్రలలో ఆమె నటన ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుందని నిరూపించిన సినిమానే 'రాయన్'. ఈ సినిమాలో ధనుశ్ చెల్లెలిగా అసమానమైన ఆమె నటన ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతుంది. అంతటి సహజంగా ఆమె ఆ పాత్రకి జీవం పోసింది. ఆ సినిమా తరువాత ఆమె గురించి సెర్చ్ చేసినవారు ఎక్కువేనని చెప్పాలి. ఆ సినిమానే ఆమెకి 'వేట్టయన్'లో అవకాశం దక్కేలా చేసింది.'వేట్టయన్'లో దుషారా ఓ సాధారణమైన స్కూల్ టీచర్ పాత్రను పోషించింది. ఇందులో అన్యాయాన్ని... అవినీతిని ధైర్యంగా నిలదీసే పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఈ కథకు ఈ పాత్రనే కీలకం. కథ అంతా కూడా ఆమె పాత్రను ఆధారంగా చేసుకునే నడుస్తుంది. అలాంటి ఈ సినిమాలో ఆమె నటనకి ప్రశంసలు దక్కాయి. దాంతో ఇప్పుడు ఆమె డిమాండ్ పెరిగిపోయిందని టాక్. విక్రమ్ సినిమా 'వీర ధీర శూరన్' తో పాటు, మరికొన్ని ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. మొత్తానికి దుషారా దూకుడు పెరిగినట్టేనని చెప్పుకోవాలి. 

Dushara Vijayan
Rajanikanth
Dhanush
Kollywood
  • Loading...

More Telugu News