Devi Sri Prasad: సీఎం రేవంత్ రెడ్డితో రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ భేటీ

Music Director Devi Sri Prasad Meet CM Revanth Reddy

  • జూబ్లీహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి నివాసంలో సీఎం, డిప్యూటీ సీఎంల‌ను క‌లిసిన డీఎస్‌పీ
  • ఈ నెల 19న గ‌చ్చిబౌలి స్టేడియంలో నిర్వ‌హిస్తున్న మ్యూజిక్ ఈవెంట్‌కు ఆహ్వానం
  •  సీఎం వ‌ద్ద‌కు రాక్‌స్టార్ వెంట‌ బండ్ల గ‌ణేశ్

సీఎం రేవంత్ రెడ్డిని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ క‌లిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్య‌మంత్రి నివాసంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను డీఎస్‌పీ నేడు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. 

ఈ నెల 19న హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స్టేడియంలో నిర్వ‌హిస్తున్న మ్యూజిక్ ఈవెంట్‌కు రావాల‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రుల‌ను దేవీశ్రీ ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో రాక్‌స్టార్ వెంట‌ ప్ర‌ముఖ సినీ నిర్మాత‌, కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేశ్ కూడా ఉన్నారు. 


More Telugu News