Samallest Washing Mechine: ప్రపంచంలో ఇదే అత్యంత చిన్న వాషింగ్ మెషీన్.. భారతీయుడి గిన్నిస్ రికార్డు

Indian Man Breaks World Record With The Smallest Washing Machine Ever

  • వాషింగ్ మెషీన్ పరిమాణం 1.28 1.32, 1.52 అంగుళాలు మాత్రమే 
  • గిన్నిస్ ప్రతినిధుల ముందు వాషింగ్ మెషీన్ పనితీరును ప్రదర్శించి చూపిన సెబిన్ సాజీ
  • ఇటీవల ప్రపంచంలోనే అత్యంత సూక్ష వ్యాక్యూమ్ క్లీనర్ రూపొందించింది కూడా మనోడే

ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్‌ను రూపొందించిన భారతీయుడు సెబిన్ సాజీ తన ఇంజినీరింగ్ నైపుణ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీని కొలతలు వరుసగా 1.28 1.32, 1.52 అంగుళాలు మాత్రమే. 1990లలో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన ప్రసిద్ధి హ్యాండెహెల్డ్ బొమ్మ అయిన తమగోచి డిజిటల్ పెట్ కంటే ఇది చిన్నది. సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పనిచేస్తుంది.

ఇప్పుడీ సూక్ష్మ వాషింగ్ మెషీన్ గిన్నిస్ రికార్డు సాధించింది. గిన్నిస్ రికార్డు కోసం సాజీ దానిని డిజైన్, అసెంబుల్ చేసి ఆపై అది పనిచేస్తున్నట్టు ప్రదర్శించి చూపించాడు. అంటే వాష్, రిన్స్, స్పిన్ వంటి అన్ని ఫంక్షన్లు పనిచేస్తున్నట్టు చూపించాడు. అతడు దానిని కొలిచేందుకు ప్రత్యేక డిజిటల్ కాలిపర్స్‌ను ఉపయోగించాడు.

సెబిన్ తన వాషింగ్ మెషీన్‌కు సంబంధించి విడుదల చేసిన వీడియోలో అతడు.. చిటికెడు వాషింగ్ పౌడర్ తీసుకుని నీరు పోసి ఆన్ చేయడం కనిపించింది. సెబిన్ ఇంజినీరింగ్ నైపుణ్యానికి అందరూ అచ్చెరువొందుతున్నారు. వాషింగ్ మెషీన్‌ను చూసేందుకు పోటెత్తారు. కాగా, ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్ క్లీనర్‌ను కూడా ఇటీవల ఇండియాలోనే తయారుచేశారు. ఇది 0.65 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. 

More Telugu News