Sri Lanka: షాకింగ్ ఘ‌ట‌న‌.. కో-పైల‌ట్‌ను బ‌య‌టే ఉంచి.. కాక్‌పిట్‌ను లాక్ చేసుకున్న పైల‌ట్‌!

Sri Lankan Pilot Locks Woman Colleague Out Of Cockpit Over Toilet Break

  • సిడ్నీ నుంచి కొలంబో వెళ్తున్న‌ శ్రీలంక ఎయిర్‌లైన్స్ లో ఘ‌ట‌న
  • మహిళా కో-పైలట్‌ కాక్‌పిట్ నుంచి రెస్ట్‌రూమ్‌కు వెళ్లిన స‌మ‌యంలో పైల‌ట్ నిర్వాకం
  • ఈ ఘటనపై శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ విచారణ

సిడ్నీ నుంచి కొలంబో వెళ్తున్న‌ శ్రీలంక ఎయిర్‌లైన్స్ లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండ‌గా కో-పైలట్‌ను కాక్‌పిట్ బ‌య‌టే ఉంచి, పైలట్ లాక్ చేసుకున్నాడు. మహిళా కో-పైలట్‌ కాక్‌పిట్ నుంచి రెస్ట్‌రూమ్‌కు వెళ్లిన స‌మ‌యంలో పైల‌ట్ ఈ నిర్వాకానికి పాల్ప‌డ్డాడు. 

దాంతో క్యాబిన్ సిబ్బంది కాక్‌పిట్‌కు కమ్యూనికేషన్ లింక్ ద్వారా కో-పైలట్‌ను తిరిగి లోపలికి అనుమతించమని కెప్టెన్‌ను కోరారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం కాక్‌పిట్‌లో ఆమె ప్రత్యామ్నాయం కోసం ఏర్పాటు చేయకుండా పైలట్ విరామం కూడా తీసుకున్నట్లు తెలిసింది. 

ఈ ఘటనపై శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ విచారణ జరుపుతోంది. అదే సమయంలో విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని, దర్యాప్తు ముగిసే వరకు ఈ నిర్వాకానికి పాల్ప‌డిన‌ పైలట్‌ను విధుల నుంచి తప్పించామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.

కాగా, భద్రతా నిబంధ‌న‌ల దృష్ట్యా విమానయాన సంస్థల‌న్నీ విమాన ప్రయాణ సమయంలో కాక్‌పిట్‌లో అన్ని సమయాల్లో కనీసం ఇద్దరు సిబ్బందిని తప్పనిసరిగా ఉంచ‌డం జ‌రుగుతుంది.

More Telugu News