Raghunandan Rao: కొండా సురేఖ మార్ఫింగ్ ఫొటో ఇష్యూ... రఘునందన్ రావు ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్

Two accused arrested in Konda Surekha marphing photo case
  • కొండా సురేఖ, రఘునందన్ రావు ఫొటోలను ఎడిట్ చేసి పోస్ట్ చేసిన నిందితులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు
  • నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన ఇద్దరి అరెస్ట్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలో పాల్గొన్న ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మెడలో రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా ఓ చేనేత కండువాను వేశారు. దీనిని ఎడిట్ చేసిన నిందితులు అసభ్యకరరీతిలో పోస్ట్ చేశారు. దీంతో రఘునందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంపీ ఫిర్యాదుపై విచారణ జరిపిన పోలీసులు నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
Raghunandan Rao
Konda Surekha
BJP
BRS

More Telugu News