KTR: మూసీ ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు... కేటీఆర్‌పై కేసు నమోదు

Utnoor police files case against KTR

  • మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ ఆరోపణలు
  • ఢిల్లికి రూ.25 వేల కోట్లు పంపిస్తున్నారని కేటీఆర్ ఆరోపణ
  • ఉట్నూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వంపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తూ బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది. మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్ల రూపాయల కుంభకోణమని, అందులో రూ.25 వేల కోట్లు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆమె ఫిర్యాదు చేశారు.

ఆత్రం సుగుణ 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్ చేతిలో 90 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

KTR
BRS
Musi Project
Hyderabad
Congress
  • Loading...

More Telugu News