KTR: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన కేటీఆర్

KTR condolences to Rajendra Prasad

  • ఇటీవలే రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత
  • గుండెపోటుతో కన్నుమూసిన గాయత్రి
  • రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఓదార్చారు.

ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆమె హఠాన్మరణానికి గురయ్యారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. రాజేంద్రప్రసాద్ ను ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపాన్ని తెలియజేశారు.

KTR
BRS
Rajendra Prasad
Tollywood
  • Loading...

More Telugu News