Jagan: మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం..!: జగన్ కు టీడీపీ కౌంటర్

TDP counter to Jagan

  • ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోందని జగన్ ప్రశ్న
  • మీ ఇసుక దోపిడీపై ఎఫ్ఐఆర్ నమోదయిందన్న టీడీపీ
  • మద్యం అమ్మకాలపై కూడా విచారణ ప్రారంభమవుతుందని వెల్లడి

ఏపీలో ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతోందంటూ వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. నువ్వు ఉండే బెంగళూరులో ఏమో కానీ... ఏపీలో మాత్రం దొరుకుతోందని తెలిపింది. ఇసుక, మద్యం గురించి నీవు ఎంత తక్కువ మాట్లాడితే నీకు అంత మంచిదని హితవు పలికింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి... వందల మంది ఆత్మహత్యకు కారణమయ్యావని విమర్శించింది. 

నీ ఇసుక దోపిడీకి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయిందని, విచారణ కూడా జరుగుతుందని టీడీపీ తెలిపింది. ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు వస్తుందని చెప్పింది. పాలన, పాలసీల గురించి మాట్లాడే హక్కు నీకు లేదని వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలపై కూడా త్వరలోనే విచారణ ప్రారంభమవుతుందని తెలిపింది.

Jagan
YSRCP
Telugudesam
Sand
Liquor
  • Loading...

More Telugu News