Chelluboyina: అప్పుడేమో చేగువేరా అన్నారు... ఇప్పుడేమో చంద్రబాబు అంటున్నారు: పవన్ కల్యాణ్ పై చెల్లుబోయిన సెటైర్లు

Chelluboyina satires on Pawan Kalyan

  • చంద్రబాబు తనకు స్ఫూర్తి అన్న పవన్ కల్యాణ్
  • పవన్ కు ఎంతమంది స్ఫూర్తి అంటూ చెల్లుబోయిన ప్రశ్న
  • సనాతనధర్మం పేరుతో డ్రామాలాడారని విమర్శ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సెటైర్లు వేశారు.

పవన్ కు ఎంత మంది స్ఫూర్తి? అని ఆయన ప్రశ్నించారు. చేగువేరా తనకు స్ఫూర్తి అని గతంలో పవన్ చెప్పారని... ఇప్పుడేమో చంద్రబాబు తనకు స్ఫూర్తి అంటున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు సనాతనధర్మం పేరుతో డ్రామాలాడారని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీపై కూడా చెల్లుబోయిన విమర్శలు గుప్పించారు. సొంతవారికి సంపద సృష్టించేందుకే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారని మండిపడ్డారు. మద్యం టెండర్లకు దరఖాస్తు ప్రక్రియను రెండు రోజులు పొడిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రజలను తాగుబోతులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chelluboyina
YSRCP
Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News