liquor shops: ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ

liquor shops lottery today in andhra pradesh

  • రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు 89,882 ధరఖాస్తులు
  • అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో పునః పరిశీలన యోచనలో ఎక్సైజ్ శాఖ
  • షాపుల కేటాయింపునకు నేడు లాటరీ ప్రక్రియ నిర్వహించనున్న ఎక్సైజ్ శాఖ

ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా,  89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది.

అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. 

కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాటరీ పధ్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న (రేపు) ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుండి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది. 

  • Loading...

More Telugu News