Sridhar Babu: శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధంగానే జరిగింది: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sirdhar Babu replies to Harish Rao remarks

  • మహేందర్ రెడ్డికి మండలిలో చీఫ్ విప్ పదవి
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి ఎలా ఇస్తారన్న హరీశ్
  • రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ విమర్శలు
  • బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్న మంత్రి శ్రీధర్ బాబు

బీఆర్ఎస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు. 

శాసనమండలి చీఫ్ విప్ నియామకం రాజ్యాంగబద్ధంగానే జరిగిందని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన మీదటే శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హరీశ్ రావు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనుకుంటే కుదరదని స్పష్టం చేశారు. 

హరీశ్ రావు గతంలో శాసనసభా వ్యవహారాల మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు...  అప్పుడు జరిగిన సంగతులు ఆయనకు గుర్తు లేవా? అప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు అనిపించలేదా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. 

ఇక అరెకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు సమర్థించుకున్నారు. నిబంధనలను అనుసరించి, సంప్రదాయం ప్రకారమే విపక్ష సభ్యుడికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News