Nara Rohot-Siri Lella: నారా రోహిత్-సిరి లేళ్ల నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!

Nara Rohith engagement with Siri Lella held in Hyderabad

  • ప్రతినిధి-2 చిత్రంలో కలిసి నటించిన నారా రోహిత్, సిరి లేళ్ల
  • ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
  • హైదరాబాదులో నేడు ఘనంగా నిశ్చితార్థం
  • హాజరైన నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు

టాలీవుడ్ కథానాయకుడు నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ప్రతినిధి-2 చిత్రంలో తనతో కలిసి నటించిన సిరి లేళ్లతో నారా రోహిత్ జీవితం పంచుకోబోతున్నాడు. ఇవాళ నారా రోహిత్-సిరి లేళ్ల నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

ఈ నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం, నారా రోహిత్ పెదనాన్న నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు హాజరై ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు, సన్నిహితులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News