liquor prices: విదేశీ మద్యం బాటిళ్ల ధరలపై ఏపీ సర్కార్ చట్ట సవరణ

AP Govt Notificatin on liquor prices

  • ఏపీలో రెండు రోజుల్లో అందుబాటులోకి రానున్న ప్రైవేటు మద్యం షాపులు
  • దేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరలపై ఏపీ సర్కార్ చట్ట సవరణ
  • అదనపు ప్రివిలేజ్ ఫీజుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా రెండు రోజుల్లో ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ద్వారా సుమారు 17వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. నూతనంగా ప్రైవేటు వైన్ షాపులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దేశంలో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్లకు సంబంధించి ఎమ్మార్పీ ధరలపై ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. 

ఈ మేరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదనపు ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు పెంచుతూ సవరణ చేశారు. దీంతో ఎమ్మార్పీ ధర రూ.150.50లకుపైగా ఉంటే రూ.160కి పెంచేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు ఉండనుంది. రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

liquor prices
Andhra Pradesh
Notification
ap govt
  • Loading...

More Telugu News