India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై గెలుపుతో ఆల్‌టైమ్ రికార్డు సాధించిన టీమిండియా

biggest win in terms of runs against Bangladesh by any team in T20Is in Hyderabad T20

  • టీ20ల్లో బంగ్లాదేశ్‌పై అత్యధికంగా 133 పరుగుల తేడాతో గెలిచిన భారత్
  • గతంలో 104 పరుగుల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా రికార్డును బద్దలు కొట్టిన భారత్
  • హైదరాబాద్ టీ20లో సంజూ శాంసన్ విధ్వంసంతో టీమిండియా రికార్డు విజయం

హైదరాబాద్‌ వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించింది. భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ విజయంతో భారత్ ఒక ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.

టీ20 ఫార్మాట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాపై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బద్దలు కొట్టింది. 

బంగ్లాపై అత్యధిక పరుగుల తేడాతో విజయాలు
1. భారత్ -133 పరుగులు (2024)
2. దక్షిణాఫ్రికా - 104 పరుగులు (2022)
3. పాకిస్థాన్‌ - 102 పరుగులు (2008)
4. భారత్ - 86 పరుగులు (2024)
5. దక్షిణాఫ్రికా- 83 పరుగులు (2017) 

కాగా హైదరాబాద్ టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చెలరేగారు. సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్-సంజూ శాంసన్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత చివరిలో హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు బాదాడు. దీంతో భారత్ ఈ రికార్డు స్థాయి లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది.

  • Loading...

More Telugu News