Chandrababu: మానవతా సాయంలో చిరంజీవి గారు ఎప్పుడూ ముందుంటారు: సీఎం చంద్రబాబు

CM Chandrababu appreciates Chiranjeevi and Ram Charan

  • ఏపీలో వరద బీభత్సం
  • చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
  • నేడు రూ.1 కోటి చెక్ లను చంద్రబాబుకు అందించిన చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళ హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.1 కోటి చెక్ లను అందించారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ.50 లక్షలతో మొత్తం రూ.1 కోటి విరాళం అందించిన చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

"మానవతా సాయం అందించడంలో చిరంజీవి గారు ఎల్లప్పుడూ ముందుంటారు. విపత్తు సమయాల్లో తప్పకుండా తన మద్దతు అందిస్తుంటారు. వరద బాధితుల జీవితాలను పునర్ నిర్మించడంలో చిరంజీవి, రామ్ చరణ్ అందించిన సాయం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu
Chiranjeevi
Ram Charan
AP Floods
Donations
CMRF
Andhra Pradesh
  • Loading...

More Telugu News