Revanth Reddy: పండుగ పూట సొంతూరికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి... ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

CM Revanth Reddy gets grand welcome in Kondareddy Palli

  • ప్రతి ఏటా దసరాను కొండారెడ్డిపల్లిలో జరుపుకుంటున్న రేవంత్ రెడ్డి
  • ఈసారి సీఎం హోదాలో సొంతూరికి రాక
  • కొండారెడ్డిపల్లిలో పలు భవనాలను ప్రారంభించిన రేవంత్ రెడ్డి

దసరా పండుగ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరికి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారిగా నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి విచ్చేశారు. ప్రతి సంవత్సరం విజయదశమి పండుగను రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనే జరుపుకుంటారు. ఈసారి సీఎంగా సొంతూరిలో వేడుకలు జరుపుకుంటుండడం విశేషం. 

కాగా, రేవంత్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. తన పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి నూతన పంచాయతీ భవనం, వెటర్నరీ హాస్పిటల్, అమర జవాను యాదయ్య మెమోరియల్ లైబ్రరీ, బీసీ సామాజిక భవనాలను ప్రారంభించారు. 

సీఎం రాక నేపథ్యంలో అధికారులు కొండారెడ్డిపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు.

Revanth Reddy
Dasara
Kondareddy Palli
Congress
Telangana
  • Loading...

More Telugu News