Chandrababu: శ్రీసత్యసాయి జిల్లాలో గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన సీఎం చంద్రబాబు

CM Chandranbabu talks to Sri Satyasai district SP

  • చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఘటన
  • నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో కాపలా కోసం వచ్చిన కుటుంబం
  • గత ఐదు నెలలుగా మిల్లు వద్దే ఉంటున్న కుటుంబం
  • గత రాత్రి కత్తులతో బెదిరించి అత్యాకోడళ్లపై అత్యాచారం చేసిన దుండగులు

శ్రీసత్యసాయి జిల్లాలో కొందరు దుండగులు అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. 

ఇక్కడ నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో కాపలా కోసం బళ్లారి నుంచి ఓ కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం గత  ఐదు నెలలుగా ఇక్కడే పేపర్ మిల్లు వద్దే ఉంటోంది. అయితే, గత రాత్రి బైక్ లపై వచ్చిన దుండగులు ఆ కుటుంబ యజమానిని, అతడి కుమారుడ్ని కత్తులతో బెదిరించి... అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ఈ గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ రత్నతో ఆయన మాట్లాడారు. ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు.

More Telugu News