Vishwambhara Teaser: ‘విశ్వంభ‌ర’ టీజ‌ర్ వ‌చ్చేసింది!

Vishwambhara Teaser Out Now

  • చిరంజీవి కథానాయకుడిగా విశ్వంభర
  • యువ దర్శకుడు వశిష్ఠ ద‌ర్శ‌క‌త్వం 
  • యూవీ క్రియేష‌న్స్ నిర్మాణం
  • ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మూవీ టీజ‌ర్

మెగాస్టార్ చిరంజీవి, యువ‌ దర్శకుడు వశిష్ఠ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం విశ్వంభ‌ర‌. ద‌స‌రా సంద‌ర్భంగా మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. శుక్ర‌వారం చెప్పిన‌ట్లుగానే ద‌స‌రా కానుక‌గా ఈ సినిమా టీజ‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థ‌ విడుద‌ల చేసింది. 

సోషియో ఫాంటసీగా వ‌స్తున్న ఈ మూవీలో మ‌రోసారి చిరు త‌న న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేశారు. టీజ‌ర్‌లో గ్రాఫిక్స్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. మెగాస్టార్‌ మాస్‌ అవతార్‌, పవర్‌ఫుల్‌ డైలాగులు, గ్రాండ్‌ విజువల్స్‌తో ఈ టీజర్‌ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది.

ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బ‌డ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. అస్కార్ అవార్డు విజేత‌ ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. 

Vishwambhara Teaser
Chiranjeevi
Tollywood

More Telugu News