Dil Raju: సంక్రాంతి బ‌రిలో 'గేమ్ చేంజ‌ర్‌'.. చిరంజీవికి దిల్ రాజు థ్యాంక్స్‌!

Producer Dil Raju Thanks to Mega Star Chiranjeevi

  • సంక్రాంతి బ‌రి నుంచి త‌ప్పుకున్న 'విశ్వంభ‌ర‌'
  • కుమారుడి సినిమా కోసం చిరు త్యాగం
  • ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి, యువీ క్రియేష‌న్స్ వారికి దిల్‌రాజు ధ‌న్య‌వాదాలు

గ్లోబల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ భామ‌ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

కాగా, ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ పండుగ సంద‌ర్భంగా రిలీజ్‌ చేయాల‌ని మేక‌ర్స్‌ అనుకున్నారు. కానీ ఇప్పుడు 2025 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిచ్చారు. 

ఈ సంద‌ర్భంగా సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ సినిమాను విడుద‌ల‌ చేయ‌టానికి త‌మ‌కు స‌పోర్ట్ చేసిన‌ మెగాస్టార్ చిరంజీవికి, యువీ క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నిర్మాత దిల్‌రాజు ధ‌న్య‌వాదాలు తెలిపారు.   

దిల్‌రాజు మాట్లాడుతూ... ‘‘ ‘గేమ్ చేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్‌ చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్న‌ప్పుడు క్రిస్మ‌స్ కంటే సంక్రాంతి అయితే బావుంటుంద‌ని నాతో పాటు  బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ భావించాం. ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవికి, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు తెలియ‌జేశాం. 

మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభ‌ర‌’ సినిమా కూడా భారీ బ‌డ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వ‌స్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అందువ‌ల్ల సంక్రాంతి డేట్ కావాల‌ని చిరంజీవిని, యువీ సంస్థ‌ను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. 

‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి వ‌స్తుండ‌టంతో వాళ్ల విశ్వంభ‌ర సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు విడుద‌ల చేయాల‌నుకున్నారు. నిజానికి విశ్వంభ‌ర సినిమా ముందు అనుకున్న విడుద‌ల తేదీ నాటికే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో స‌హా పూర్త‌వుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు విడుద‌ల‌ చేయ‌టానికి ఒప్పుకున్నందుకు చిరంజీవి, యువీ క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నా ధ‌న్య‌వాదాలు. 

‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతి విడుద‌ల చేస్తున్నాం. ఇటు అభిమానుల‌కు, అటు సినీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్ద‌తూ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాం. ఇప్ప‌టికే రెండు పాట‌లు విడుద‌లయ్యాయి. రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇటీవ‌ల విడుద‌లైన  ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ యూ ట్యూబ్‌లో మారుమోగిపోతుంది. అతి త్వ‌ర‌లోనే టీజ‌ర్ వ‌స్తుంది. ఆ త‌ర్వాత మ‌రో మూడు పాట‌ల‌ను రిలీజ్ చేస్తాం. 

సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజ‌యం సాధించేలా ప్లాన్ చేశాం. అటు రామ్ చ‌ర‌ణ్‌కి గ్లోబ‌ల్ స్టార్ అనే బ్రాండ్ ఏదైతే ప‌డిందో దాన్ని.. గ్లోబ‌ల్‌గా ఈ సినిమా విజ‌యం సాధించేలా ప్ర‌య‌త్నిస్తున్నాం. ఆ ప్ర‌య‌త్నం త‌ప్ప‌కుండా ఫలిస్తుంది. సంక్రాంతికి క‌లుద్దాం’’ అని దిల్ రాజు అన్నారు.

  • Loading...

More Telugu News