Revanth Reddy: ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ

TG issues GO on Indiramm Committee

  • గ్రామస్థాయిలో చైర్మన్‌గా సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి 
  • మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్‌గా కౌన్సిలర్ లేదా కార్పోరేటర్
  • కన్వీనర్‌గా పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్

పంచాయతీ, మున్సిపల్, వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు జీవో జారీ చేసింది. గ్రామస్థాయిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్ లేదా కార్పోరేటర్ చైర్మన్‌గా కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు ఆఫీసర్ ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్‌గా ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, ముగ్గురు స్థానికులు కమిటీలో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ కమిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొనసాగనుంది. శనివారం నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. కమిటీల కోసం పేర్లు పంపించాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Revanth Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News