Mogulaiah: కిన్నెర కళాకారుడు మొగులయ్య ప్లాట్ కాంపౌండ్ వాల్‌ను ధ్వంసం చేసిన దుండగులు

Unknown persons damage compound wall of Telangana folk artiste plot

  • 2022లో పద్మశ్రీ అవార్డు పొందిన మొగులయ్య
  • హయత్ నగర్‌లో 600 గజాల ప్లాట్ ఇచ్చిన ప్రభుత్వం
  • ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ వేసిన మొగులయ్య

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య ప్లాట్ కాంపౌండ్ వాల్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మొగులయ్యకు ప్రభుత్వం హయత్‌నగర్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భూమికి సంబంధించిన పట్టాను మొగులయ్యకు అందించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలని భావించిన మొగులయ్య చుట్టూ కాంపౌండ్ వాల్‌ను నిర్మించుకున్నారు.

కానీ ఈ గోడను రాత్రికి రాత్రి దుండగులు కూలగొట్టారు. కాంపౌండ్ వాల్ కూల్చివేయడంతో మొగిలయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొగిలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. గోడ కూల్చివేతకు కారణం ఎవరో తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని హయత్ నగర్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈ ప్లాట్‌కు సంబంధించి ఎలాంటి భూవివాదం లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరిపై అనుమానం కూడా లేదని మొగిలయ్య చెప్పినట్లు వెల్లడించారు.

జానపద సంగీత కళాకారుడు మొగులయ్యకు 2022లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలంగాణకు చెందిన ప్రత్యేకమైన జానపద సంగీత వాయిద్యమైన కిన్నెర సాంప్రదాయ కళారూపాన్ని పరిరక్షించడంలో చేసిన కృషికి గాను కేంద్రం పద్మ అవార్డుతో సత్కరించింది.

  • Loading...

More Telugu News