Ratan Tata: రతన్ టాటా మృతికి కారణం ఇదే: డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా

Ratan Tata dead due to multiple organ failure

  • టాటా మరణంతో విషాదంలో మునిగిపోయిన యావత్ దేశం
  • రతన్ టాటా 'లో బీపీ'తో బాధ పడ్డారన్న డాక్టర్ గోల్వాలా
  • దీని కారణంగా చాలా అవయవాలు క్రమంగా పని చేయడం మానేశాయని వెల్లడి

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంతో యావత్ దేశం ఆవేదనలో మునిగిపోయింది. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ప్రపంచ నలుమూలలకు విస్తరించారు. అత్యున్నత విలువలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించిన రతన్ టాటా... కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ టాటా ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆసుపత్రిలోనే ఆయన మృతి చెందారు. 

రతన్ టాటాకు చికిత్స అందించిన డాక్టర్ షారుఖ్ అస్పి గోల్వాలా... కీలక విషయాన్ని వెల్లడించారు. రతన్ టాటా 'లో బీపీ'తో బాధపడ్డారని ఆయన తెలిపారు. రక్తపోటు తక్కువగా ఉండటం కారణంగా ఆయన శరీరంలోని చాలా అవయవాలు క్రమంగా పని చేయడం మానేశాయని చెప్పారు. దీనికి తోడు ఆయనకు డీహైడ్రేషన్ సమస్య కూడా తోడయిందని తెలిపారు. వయసు మీరిన వారికి ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News