Pushpa2: పుష్ప-2 ది రూల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ డీటైల్స్‌ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

The Pre Release Business Details of Pushpa2 The Rule Will Leave You Astonished

  • సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా పుష్ప-2 ప్రీరిలీజ్‌ బిజినెస్‌ 
  • రూ.1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌!
  • హిందీలో రూ.400 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని అంచనా 

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కలయికలో తెరకెక్కిన చిత్రం పుష్ప ది రైజ్‌ తెలుగుతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తగ్గేదేలే అంటూ ఈ సినిమాలో పుష్పరాజ్‌ నటనకు అందరూ ఫిదా అయ్యారు.  ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ జాతీయ పురస్కారం కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే క్రేజీ కాంబినేషన్‌లో, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 ది రూల్‌. 

మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఒకవైపు షూటింగ్‌.. మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో పుష్ప-2 టీమ్‌ బిజీగా వుంది. 

ఇక అసలు విషయానికొస్తే... ప్రస్తుతం పుష్ప-2 చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ట్రేడ్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడే ఒక సినిమా ఆల్‌ లాంగ్వేజ్‌స్‌ థియేట్రికల్‌ హక్కులు, ఓవర్సీస్‌, డిజిటల్‌, శాటిలైట్‌, మ్యూజిక్‌ ఇలా అన్ని రైట్స్‌ హాట్‌కేక్‌లా, క్రేజీ, ఫ్యాన్సీ అమౌంట్‌కు అమ్ముడుపోయిన చిత్రం పుష్ప-2నే అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి ఉన్న క్రేజే అందుకు కారణం. దాదాపు పుష్ప-2 ది రూల్‌ రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిందని సమాచారం. తెలిసిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ రూ.280 కోట్లు, హిందీ థియేట్రికల్‌ రైట్స్‌ రూ.200 కోట్లు (అడ్వాన్స్‌), మ్యూజిక్‌ రైట్స్‌ రూ.65 కోట్లు ఓవర్సీస్‌ రైట్స్ రూ.100 కోట్లు, శాటిలైట్‌ రైట్స్‌ రూ.75 కోట్లు రూపాయలకు హెవీ కాంపీటీషన్‌ మధ్య చేజిక్కించుకున్నారట. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల థియేట్రికల్‌ రైట్స్‌తో కలుపుకుని దాదాపుగా మొత్తం పుష్ప-2 బిజినెస్‌ వెయ్యికోట్లకు చేరుకుందట. 

అంతేకాదు ఈ సినిమా కేవలం హిందీలోనే దాదాపుగా రూ.400 కోట్లు  పైగా కలెక్ట్‌ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేయడం కూడా ఓ రికార్డే అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News