Pakistan: పాక్‌లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన ఉగ్రవాదులు

Terrorists Killed 20 In Pakistan Mines

  • బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘటన
  • జునైద్ కోల్ కంపెనీ గనిలో ఉగ్రవాదుల దుశ్చర్య
  • మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్ జాతీయులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం జరిగింది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపాడు. ప్రావిన్సులోని దికీ జిల్లాలో ఉన్న జునైద్ కోల్ కంపెనీకి చెందిన బొగ్గు గని వసతి గృహాల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కార్మికులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో ఎక్కువమంది బలూచిస్థాన్ ప్రావిన్సులోని పష్తున్ ప్రాంతానికి చెందినవారే. అలాగే, మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవారున్నారు. వచ్చే వారం ఇస్లామాబాద్‌లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించలేదు. కాగా, బలూచిస్థాన్‌లో ఎక్కువగా తెహ్రీక్ -ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తరచూ ఉగ్రదాడులకు దిగుతూ ఉంటుంది. ఈ ఘటన కూడా దాని పనేనని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News