Ratan Tata: రతన్ టాటా పార్థివదేహం వద్ద బాధతో పెంపుడు శునకం 'గోవా'... వీడియో ఇదిగో

Ratan Tata devoted dog Goa offers a heartfelt farewell

  • నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన రతన్ టాటా
  • అందరినీ కదిలించిన శునకం ఆవేదన
  • పెంపుడు శునకంతో రతన్ టాటాకు మంచి అనుబంధం

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు ఆయన పెంపుడు శునకం 'గోవా' వీడ్కోలు పలికింది. రతన్ టాటా నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. పెంపుడు శునకం ఆయన పార్థివదేహం వద్ద కూర్చున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రతన్ టాటాలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆ శునకం బాధాకరంగా కనిపించింది. శునకం ఆవేదన అక్కడున్న వారందరినీ కదిలించింది.

రతన్ టాటాకు తన పెంపుడు శునకం గోవాతో మంచి అనుబంధం ఉంది. రతన్ టాటా ఓసారి గోవా వెళ్లారు. అక్కడ ఆయన వెంట ఓ శునకం నడుస్తూ వచ్చింది. దానిని చూసి ముచ్చటపడిన రతన్ టాటా ఆ శునకాన్ని దత్తత తీసుకున్నారు. దానికి గోవా అని పేరు పెట్టారు. ఈ శునకం పదకొండేళ్లుగా రతన్ టాటాతోనే ఉంటోంది.

Ratan Tata
Dog
Goa

More Telugu News