Divvela Madhuri: దువ్వాడ సన్నిహితురాలు దివ్వెల మాధురిపై కేసు నమోదు

Police files case on Divvela Madhuri

  • ఇటీవల తిరుమల వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి
  • తిరుమల కొండపై ఫొటోషూట్
  • చిక్కుల్లో పడిన దివ్వెల మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి ఇటీవల తిరుమలలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తిరుమల కొండపై దువ్వాడ, మాధురి ఫొటోషూట్ కూడా చేశారు. 

అయితే, ఆ ఫొటోషూట్ ఇప్పుడు దివ్వెల మాధురిని చిక్కుల్లోకి నెట్టింది. ఆమెపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసినట్టు మాధురిపై ఆరోపణలు వచ్చాయి. 

గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం మీడియాలో ప్రముఖంగా కనిపిస్తోంది. దువ్వాడ భార్య వాణి మీడియాకెక్కడంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Divvela Madhuri
Duvvada Srinivas
Tirumala
Photo Shoot
Police Case
YSRCP
  • Loading...

More Telugu News