Amrapali: ఆమ్రపాలి సహా పలువురు అధికారుల విజ్ఞప్తికి కేంద్రం తిరస్కరణ... ఏపీకి వెళ్లాలని ఆదేశాలు

Amrapali Kata will now be required to transition back to the AP cadre

  • తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరిన ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్
  • 11 మంది అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం
  • ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు

తెలంగాణలో కొనసాగుతున్న ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రోస్ తదితర అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలోనే కొనసాగించాలన్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అభ్యంతరాలను కేంద్రం తోసిపుచ్చింది. వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతి తదితర అధికారులు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. కానీ వారి విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం... ఏపీకి వెళ్లాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఆమ్రపాలి కాటా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా, రొనాల్డ్ రోస్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.  వారితో పాటు వాణీప్రసాద్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతితో పాటు పలువురు అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

మొత్తం 11 మంది అధికారులు తెలంగాణ కేడర్ కావాలంటూ కేంద్రాన్ని కోరారు. కానీ వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అధికారులు అందరూ సొంత రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల పేరుతో లేఖను రాస్తూ... వాటి కాపీలను తెలంగాణ, ఏపీ చీఫ్‌ సెక్రెటరీలకు కేంద్రం పంపించింది.

More Telugu News