Ratan Tata: రతన్ టాటా భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్

Chandrababu and Nara Lokesh pays tributes to Ratan Tata mortal remains

  • గత రాత్రి కన్నుమూసిన రతన్ టాటా
  • నేడు అంత్యక్రియలు
  • ముంబయి చేరుకున్న చంద్రబాబు, నారా లోకేశ్ 

ప్రఖ్యాత వ్యాపారవేత్త రతన్ టాటా పార్థివదేహాన్ని ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్సీపీఏ)కి తరలించారు. ప్రముఖులు, అభిమానులు, ప్రజలు ఎన్సీపీఏలో రతన్ టాటా భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. 

ఈ క్రమంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కూడా రతన్ టాటా భౌతికకాయాన్ని కడసారి వీక్షించి, ఆ దిగ్గజ వ్యాపారవేత్తకు నివాళులు అర్పించారు. టాటా కుటుంబ సభ్యులు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ లకు వెన్నంటి ఉండి, రతన్ టాటా భౌతికకాయం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం చంద్రబాబు... రతన్ టాటా భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. 

కాగా, మరి కొద్దిసేపట్లో రతన్ టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

More Telugu News