Ratan Tata: రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా?

Why Ratan Tata Did Not Get Marriage

  • అమెరికాలో ఉద్యోగం చేసున్నప్పుడు ప్రేమాయణం
  • నానమ్మ అనారోగ్యం కారణంగా ఇండియా వచ్చి ఏడేళ్లు ఉండిపోయిన రతన్ టాటా
  • తన కోసం ప్రియురాలు వస్తుందని భావించినా నిరాశ
  • భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో ఆమెను ఇండియాకు పంపేందుకు అనుమతివ్వని తల్లిదండ్రులు
  • ఆ తర్వాత టాటా గ్రూప్ బాధ్యతల్లో పడి పెళ్లి చేసుకోలేకపోయానన్న రతన్ టాటా 

దేశంలోని అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్తగా పేరు సంపాదించుకున్న రతన్ టాటా పెళ్లి ఎందుకు చేసుకోలేదు. ఈ విషయాన్ని ఆయనే ఒకసారి స్వయంగా వెల్లడించారు. రతన్ టాటాకి ఆయన తాత పేరు రతన్‌జీ టాటా పేరును పెట్టారు. రతన్ టాటా తండ్రి నావల్ టాటాను ఓ అనాథాశ్రమం నుంచి రతన్‌జీ, ఆయన భార్య నవాజీ భాయ్ దత్తత తీసుకున్నారు. నావల్ టాటా, సూనూ దంపతులు విడాకులు తీసుకోవడానికి ముందు జిమ్మీ జన్మించాడు.

నానమ్మ సాహచర్యంలో..
ఆ తర్వాత స్విట్జర్లాండ్ జాతీయురాలైన సిమోన్‌ను నావల్ టాటా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కలిగిన కుమారుడు నోయెల్ టాటా ‘ట్రెంట్’ సహా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు విడాకులు తీసుకునేటప్పుడు రతన్ టాటా వయసు 10 ఏళ్లు మాత్రమే. ఆ కష్ట సమయంలో నానమ్మ తనకు అండగా నిలిచారని, తనకు మార్గనిర్దేశకత్వం చేశారని రతన్ టాటా పలుమార్లు గుర్తుచేసుకున్నారు. ఆమె తనను దృఢంగా మార్చారని పేర్కొన్నారు. 

అమెరికాలో లవ్
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత రతన్ టాటా అక్కడే రెండేళ్లపాటు పనిచేశారు. అమెరికాలో ఆ రోజులు ఎంతో మధురంగా ఉండేవని రతన్ టాటా ఒకసారి గుర్తుచేసుకున్నారు. తనకు సొంతంగా కారు ఉండేదని, ఉద్యోగాన్ని ఎంతగానో ప్రేమించేవాడినని పేర్కొన్నారు. ఆ సమయంలోనే ఆయన ప్రేమలో కూడా పడ్డారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే, నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా ఇండియా వచ్చారు. నానమ్మను చూసేందుకు వచ్చిన ఆయన ఏడేళ్లపాటు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 

బంధానికి బ్రేకులు వేసిన యుద్ధం
ప్రియురాలు తన కోసం భారత్ వస్తుందని రతన్ టాటా భావించారు. అయితే, అదే సమయంలో అంటే 1962లో భారత్-చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియా పంపేందుకు అంగీకరించలేదు. దీంతో వారి బంధానికి బ్రేకులు పడింది. ఆ తర్వాత రతన్ టాటాపై టాటా గ్రూపును నడిపించాల్సిన బాధ్యత పడింది. ఈ క్రమంలోనే ఆయన టాటా గ్రూపును అత్యున్నత శిఖరాలకు చేర్చారు. ఈ క్రమంలో ఆయన తీరిక లేకుండా గడపడంతో వివాహం చేసుకోలేకపోయానని రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

Ratan Tata
Tata Group
Ratan Tata Marriage
  • Loading...

More Telugu News