Narendra Modi: మోదీ నాకు మంచి మిత్రుడు... చాలా మంచి మనిషి: డొనాల్డ్ ట్రంప్

Donald Trump praises PM Modi

  • మోదీ కంటే ముందు భారత్ అస్థిరంగా ఉండేదని వ్యాఖ్య
  • హౌడీ, మోదీ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిందని గుర్తు చేసుకున్న ట్రంప్
  • భారత్‌ను బెదిరించిన ధోరణితో మాట్లాడితే మోదీలో మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య

అమెరికా మాజీ అధ్యక్షుడు, రెండోసారి బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ మోదీ తనకు మంచి మిత్రుడు అన్నారు. ఆయన మంచి మనిషి అని కితాబునిచ్చారు. అతను చాలా గొప్పవాడు అన్నారు. ఆయన ప్రధాని కావడం కంటే ముందు భారత్ అస్థిరంగా ఉండేదని వ్యాఖ్యానించారు.

2019లో నిర్వహించిన 'హౌడీ, మోదీ' కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిందని గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీతో పలుమార్లు వేదికను పంచుకున్నట్లు చెప్పారు. ఎవరైనా భారత్ పట్ల బెదిరించిన ధోరణితో మాట్లాడితే మోదీలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు.

Narendra Modi
Donald Trump
USA
BJP
  • Loading...

More Telugu News