Chandrababu: టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు

Mopidevi and Masthan Rao join TDP

  • ఉండవల్లిలోని సీఎం నివాసంలో టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
  • హాజరైన పలువురు మంత్రులు, టీడీపీ నేతలు

మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలోనే టీడీపీ కండువాను కప్పుకున్నారు. వారికి చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు ఉన్నారు. 

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న బీద మస్తాన్ రావు 2019లో వైసీపీలో చేరారు. నాటి వైసీపీ ప్రభుత్వం 2022లో ఆయనను రాజ్యసభకు పంపించింది. మోపిదేవి వెంకటరమణ తొలుత కాంగ్రెస్‌లో ఉన్నారు. 2012లో వైసీపీలో చేరారు. ఇప్పుడు ఇరువురు టీడీపీ జెండా కప్పుకున్నారు.

More Telugu News