Ratan Tata: రతన్ టాటా ఆరోగ్యం విషమం!

Ratan Tata health critical

  • రతన్ టాటా ఆరోగ్యం క్రిటికల్ గా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు
  • ముంబైలోని ఓ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న టాటా
  • తాను బాగున్నానని రెండు రోజుల క్రితం చెప్పిన రతన్ టాటా

ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్యం విషమంగా ఉంది. క్రిటికల్ కండిషన్ లో ఉన్న టాటా... ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు వెల్లడించారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

86 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్యం గురించి ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, గత సోమవారం రతన్ టాటా స్వయంగా స్పందిస్తూ... తన వయసుకు సంబంధించిన కారణాల వల్ల రొటీన్ మెడికల్ చెకప్స్ చేయించుకుంటున్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు రోజుల వ్యవధిలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం.

Ratan Tata
Health
  • Loading...

More Telugu News