Sensex: చివరి గంటలో... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Sensex closes down by 167 points

  • సూచీలను కిందకు లాగిన రిలయన్స్, ఐటీసీ, నెస్లే
  • 167 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • రూ.3 లక్షల కోట్లు తగ్గిన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, నెస్లే తదితర షేర్లు సూచీలను కిందకు లాగాయి. ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన సూచీలు చివరి గంటలో నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 167 పాయింట్లు క్షీణించి 81,467, నిఫ్టీ 31 పాయింట్లు పడిపోయి 24,981 వద్ద స్థిరపడింది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 2,706 షేర్లు లాభాల్లో, 1,246 షేర్లు నష్టాల్లో ముగియగా, 97 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం రూ.462 లక్షల కోట్లుగా ఉండగా, ఈరోజు రూ.459 లక్షల కోట్లకు పడిపోయింది.
 
సెన్సెక్స్ 30లో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టిసీఎస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఐటీసీ, నెస్లే, హెచ్‌యూఎల్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ టాప్ లూజర్లుగా నిలిచాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 566 పాయింట్లు, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 246 పాయింట్లు లాభపడ్డాయి.

  • Loading...

More Telugu News